
సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని ఓ కుర్రాడి ఆరాటం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే బుల్లితెరపైకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు తనే రాకీభాయ్. అలియాస్ యశ్. కన్నడ రాకింగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రాలతో భారీ స్టార్ డమ్ అందుకున్నారు. ఈ సినిమాలో యశ్ లుక్స్, నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులయ్యారు. ఇక కేజీఎఫ్ 2 సినిమా వచ్చి సంవత్సరం దాటిన ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయినా ఇప్పటికీ యశ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ హీరో కొత్త సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ నెట్టంట ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కేజీఎఫ్ సినిమాలో బంగారంతో వ్యాపారం చేశారు రాకీ భాయ్. ఏకంగా గోల్డ్ మైన్స్ కు అధిపతిగా ఉన్నారు. ఇక ఇప్పుడు నిజజీవితంలో బంగారం షాప్ ఓపెనింగ్ కోసం యశ్ కు పలికిన స్వాగతం వేరేలెవల్. తాజాగా మలేషియాలో ఓ బంగారు షాప్ ఓపెనింగ్ చేయడానికి వెళ్లారు యశ్. అక్కడ గోల్డ్ స్టోర్ ప్రతినిధులు కేజీఎఫ్ 3 రేంజ్ లో ఎంట్రీ పలికారు. పది మందికి పైగా బాడీగార్డ్స్, కాస్టలీ కారులతో భారీ కాన్వాయితో యశ్ ను ఎయిర్ పోర్టును హోటల్ కు తీసుకుని వెళ్లారు. ఈ మొత్తాన్ని ఓ సినిమా రేంజ్ లో షూట్ చేసి ఆ వీడియోను నెట్టింట షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.
ఇక ఆ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హై బడ్జెట్ సినిమాలో హీరో ఎంట్రీ కూడా ఈ రేంజ్ లో ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. మీరు ఓ లుక్కెయ్యండి.
Arrival Of #Monster 🔥🤩
This Video Not less than Any Movie Introduction Scene 🔥” Malaysia Welcomes YASHBOSS “#YashBOSS #Yash19 @TheNameIsYash pic.twitter.com/UDadvTFlLj
— Yash Trends ™ (@YashTrends) July 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.