KGF 2 Day 2 Collections: రాకీభాయ్ దూకుడు మాములుగా లేదుగా.. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

|

Apr 16, 2022 | 11:25 AM

KGF Chapter 2 Collections: బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపే సినిమాల్లో KGF 2 (KGF Chapter 2) కూడా చేరింది. గురువారం నాడు థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే ఆల్ టైమ్ హైలో దూసుకపోతోంది. యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన..

KGF 2 Day 2 Collections: రాకీభాయ్ దూకుడు మాములుగా లేదుగా.. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
Kgf 2 Day 2 Box Office Collections
Follow us on

బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపే సినిమాల్లో KGF 2 (KGF Chapter 2) కూడా చేరింది. గురువారం నాడు థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే ఆల్ టైమ్ హైలో దూసుకపోతోంది. యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే పలు రికార్డులను నెలకొల్పింది. ఆ తర్వాత ఓపినింగ్ డే రోజున కూడా అదే ఊపుతో దూసుకెళ్లింది. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. మంచి టాక్‌తో దూసుకెళ్తూ, పలు రికార్డులకు నిలయమైంది. ఈ సినిమా స్లోరీలో భారీ ట్విస్టులు లేకపోయినా.. డైరెక్టర్ టేకింగ్‌, యష్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. KGF 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజులాగే, రెండో రోజు కూడా సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు 100-115 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్ 2 హిందీ వర్షన్ రెండో రోజు దాదాపు రూ.46 కోట్లు వసూళ్లు చేసినట్లు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో KGF 2 సినిమా మొదటి రోజు రూ.19.5 కోట్ల షేర్‌ రాబట్టగా, రెండో రోజు ఏకంగా రూ.27 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో రూ.7.5 కోట్లు, కర్ణాటకలో రూ.28 కోట్లు, కేరళ రూ.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా రెండో రోజుల్లో రాకీభాయ్‌ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.280 కోట్లు రాబట్టిందని రిపోర్టులు వస్తున్నాయి.

అలాగే విజయ్, పూజా హెగ్డే నటించిన దక్షిణాది చిత్రం ‘బీస్ట్’ సినిమా కూడా భారీ అంచనాలతో KGF 2 కంటే ముందే విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి స్పందన అంతతమాత్రంగానే ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా రాబట్టలేకపోతోంది.

Also Read: KGF 2: ఫస్ట్ ఫాస్టెస్ట్ 100 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. దెబ్బకు ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..