Vakeel Saab Movie Update: ‘వకీల్ సాబ్’‌ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలేనట..!

'వకీల్ సాబ్'‌ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇప్పటికే టీజర్‌ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరికి సంబంధించి...

 Vakeel Saab Movie Update: వకీల్ సాబ్‌ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలేనట..!

Updated on: Jan 17, 2021 | 5:27 PM

Vakeel Saab Movie Update: ‘వకీల్ సాబ్’‌ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇప్పటికే టీజర్‌ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరికి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారట ‘వకీల్ సాబ్’‌ మేకర్స్‌.

చిక్కుల్లో పడ్డ ముగ్గురు అమ్మాయిలను కాపాడేందుకు ఓ లాయర్‌ చేసిన పోరాటమే ‘పింక్’‌ కథ. హిందీలో లేని చాలా ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌ను తెలుగు రీమేక్‌లో జోడించారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో పవన్ క్యారెక్టరైజేషన్‌ మరింతగా ఎలివేట్ అవుతుందన్నది యూనిట్ వర్షన్.

ఇక కీలక పాత్రల్లో నటిస్తున్న అమ్మాయిల కేరక్టర్లకు, వారి బ్యాక్‌గ్రౌండ్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేశారట. చిక్కుల్లో పడ్డ అమ్మాయిలను… వాళ్ల సొంత ఫ్యామిలీలు పక్కన పెడితే.. వాళ్లకోసం పవన్‌ చేసే పోరాటం.. ఆ సీన్స్‌ లో చెప్పే డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్‌ పడటం ఖాయం అన్న టాక్‌ వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ మార్పులు ‘వకీల్ సాబ్’‌కు ప్లస్ అవుతాయా..? లేక ఒరిజినల్‌ ఫ్లేవర్‌ మిస్‌ అవ్వటం మైనస్‌ అవుతుందా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Also Read:

Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Allu Arjun’s ‘Pushpa’: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ

Loading...
Unable to load recommendations.
Follow Us