Keerthy Suresh: విజయ్ దేవరకొండ సినిమాలో కీర్తి సురేష్.. ఆ హీరోయిన్ తప్పుకుందా ?..

ఈ క్రమంలో కొద్ది రోజులుగా VD18 మూవీ గురించి అనేక వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైంది ఈ చిత్రం. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ మూవీ నుంచి అనుహ్యంగా ఆమె తప్పుకుందని టాక్ నడుస్తుంది. దీంతో ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

Keerthy Suresh: విజయ్ దేవరకొండ సినిమాలో కీర్తి సురేష్.. ఆ హీరోయిన్ తప్పుకుందా ?..
Vijay, Keerthy Suresh

Updated on: Jan 31, 2024 | 10:07 PM

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోపాటు మరో రెండు సినిమాలు సైతం రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులుగా VD18 మూవీ గురించి అనేక వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైంది ఈ చిత్రం. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ మూవీ నుంచి అనుహ్యంగా ఆమె తప్పుకుందని టాక్ నడుస్తుంది. దీంతో ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుక్మిణి.

దీంతో ఇప్పుడు విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది. కానీ విజయ్ దేవరకొండ సినిమాలో నటించడం లేదని స్వయంగా క్లారిటీ ఇచ్చింది రుక్మిణి. అంతేకాకుండా ఈ మూవీలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైందట. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కొత్త ప్రారంభం.. #VD18 అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో విజయ్ జోడిగా కీర్తి  ఎంపికైనట్లుగా స్పష్టమవుతుంది.

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ‘మహానటి’ చిత్రం వీరు నటించారు. ఈ సినిమాతో కీర్తికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్‌లు కలిసి నటించే సన్నివేశాలు లేవు. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెరపై కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.