అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh)గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఇక్క డ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అచ్ఛం సావిత్రి లానే అభినయం కనబరిచి అందరిచేత శబాష్ అనిపించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా మహేష్ బాబు కు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంట్రవ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన కీర్తికి ఓ హీరో అంటే చాలా ఇష్టమట. ఆ హీరోతో సినిమా చేయాలనీ తహతహలాడుతున్నా అని చెప్పుకొచ్చింది. ఇంతకు కీర్తి సురేష్ మెచ్చిన ఆ హీరో ఎవరంటే..
తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న కీర్తిసురేష్ కు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టమట. ఆయన నటన కు తాను ఫిదా అయ్యానని అంటుంది ఈ బ్యూటీ. ఆయన తో నటించే ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. అలాగే జయం రవి, కార్తీ ఇలా చాలా మంది నటులతో నటించాలి అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. ఇక కీర్తిసురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది.అలాగే తమిళ్ లో ఫహద్ ఫాజిల్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. మరి భవిషత్తులో కీర్తి సురేష్ కోరిక నెరవేరి విజయ్ సేతుపతితో జోడీ కడుతుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి