Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్ బర్త్ డే.. సర్‎ప్రైజింగ్ పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్స్..

నేను శైలజ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు

Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్ బర్త్ డే.. సర్‎ప్రైజింగ్ పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్స్..
Keerthy

Updated on: Oct 17, 2021 | 12:06 PM

నేను శైలజ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు… నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహనటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడమే కాకుండా… సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మహనటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. దీంతో ఒక్కసారిగా కీర్తి కెరీర్ మారిపోయింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో కీర్తి సురేష్‏కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమెతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. అతి తక్కువ సమయంలోనే తన నటనతో.. అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా.. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా కొనసాగుతుంది కీర్తి.

Keerthy Suresh

ప్రస్తుతం ఈ అమ్మడు… సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే.. చిరంజీవి నటిస్తున్ భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.. ఈరోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి వరుసగా సర్ ప్రైజింగ్ పోస్టర్స్ విడుదల చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపాయి చిత్రయూనిట్..

ట్వీట్.

ట్వీట్..

 

అలాగే.. న్యాచురల్ స్టార్ హీరోగా నటిస్తున్న దసరా సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ పుట్టిన రోజు కావడంతో దసరా చిత్రయూనిట్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది.

ట్వీట్.

Also Read: Manchu Vishnu-Pawan Kalyan: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ

Aryan Khan: పేదలకు చేయూతనిస్తా.. తప్పుడు మార్గంలో నడవను.. షారుఖ్ కొడుకు ఆర్యన్ హామీ..

Alai Balai: దత్తన్న అలయ్‌ బలయ్‌ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ముఖ్య అతిధిగా పాల్గొన్న పవన్‌ కళ్యాణ్