Jr.NTR : నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి

|

Dec 25, 2024 | 11:09 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు కోట్లమంది అభిమానులు ఉన్నారు. సినిమాలతోనే కాదు వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు తారక్. అలాగే ఆయన అభిమానులకు ఏ కష్టమొచ్చినా తారక్ తట్టుకోలేరు.

Jr.NTR : నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
Ntr Fan
Follow us on

ఎన్టీఆర్ కు ఇండియాలోనే బిగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడు. ఇక ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ పై కురిపించే ప్రేమ గురించి కూడా అందరికి తెలుసు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు తారక్. తన ఫ్యామిలి జరిగిన ప్రమాదాలు ఎవరి కుటుంబంలో జరగకూడదు అని అభిమానులకు జాగ్రత్తలు చెప్తుంటాడు. అలాగే అభిమానులకు ఏదైనా కష్టమొచ్చినా తారక్ వారికీ సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమానికి తారక్ సాయం చేశాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్ (19) బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ కు వీరాభిమాని అయినా కౌశిక్ దేవర సినిమా చూసే వరకు బ్రతికి ఉండాలి అని కోరుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడాడు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

తన కొడుకును కాపాడాలని ఎన్టీఆర్ ను కోరింది కౌశిక్ తల్లి. అయితే ఇటీవల ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ తనకు ఎలాంటి సాయం చేయలేదు అని చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ కేవలం వీడియో కాల్ మాత్రమే మాట్లాడాడని, ఎలాంటి సాయం చేయలేదని ఆమె మీడియాతో అన్నారు. కాగా తాజాగా ఆమె మరోసారి మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్

ఆమె మాట్లాడుతూ.. “ఎన్టీఆర్‌ సర్‌.. నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. మా కుటుంబమంతా మీ అభిమానులమే” అని అన్నారు. కాగా ఎన్టీఆర్ కౌశిక్ కు ఆర్ధిక సాయం చేశారు. కౌశిక్ హాస్పటల్ బిల్ కట్టారు ఎన్టీఆర్. క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్. అతని హాస్పటల్ ఖర్చులను ఎన్టీఆర్ కట్టేశారు. ఈ రోజు కౌశిక్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నాడు. ఈ క్రమంలో కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. “24న సాయంత్రం ఎన్టీఆర్‌ టీమ్‌ నాకు ఫోన్ చేశారు. మేం వస్తున్నాం.. డిశ్చార్జ్‌ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రూ.12 లక్షల బిల్లు కట్టి, డిశ్చార్జ్‌ చేయించారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్‌ అభిమానులు బాధపెట్టినట్టున్నాయి. మీరు అపార్థం చేసుకున్నారేమో. మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు” అని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.