మీ డాడీ తినకుండా వెళ్తున్నాడే ‘

| Edited By: Ram Naramaneni

Feb 11, 2020 | 6:10 PM

తాజా 728  ‘కార్తీకదీపం’  సీరియల్ ఎపిసోడ్ లో కాస్త హ్యూమర్, మరికాస్త కన్నీళ్లు, ఎమోషన్లు పండాయి. కార్తీక్‌ని హిమ, సౌందర్య ఆట పట్టించడం, కార్తీక్ భరించలేకపోవడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. హిమ ఎప్పటిలాగే.. మళ్ళీ వంటలక్క ‘అంశాన్ని’ తెస్తుంది. ‘అయ్యో ! నీకు తెలీదా డాడీ ! శ్రావ్య పిన్ని, వంటలక్క, పెద్దమ్మ’ అని ఆ చిన్నారి చెబుతుంటే కార్తీక్ మండిపడతాడు. ‘పెద్దమ్మ ఏమిటి ? పెద్దమ్మ !పేదరాసి పెద్దమ్మ లాగా ‘ అని విసవిసా అక్కడినుంచి […]

మీ డాడీ తినకుండా వెళ్తున్నాడే
Follow us on

తాజా 728  ‘కార్తీకదీపం’  సీరియల్ ఎపిసోడ్ లో కాస్త హ్యూమర్, మరికాస్త కన్నీళ్లు, ఎమోషన్లు పండాయి. కార్తీక్‌ని హిమ, సౌందర్య ఆట పట్టించడం, కార్తీక్ భరించలేకపోవడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. హిమ ఎప్పటిలాగే.. మళ్ళీ వంటలక్క ‘అంశాన్ని’ తెస్తుంది. ‘అయ్యో ! నీకు తెలీదా డాడీ ! శ్రావ్య పిన్ని, వంటలక్క, పెద్దమ్మ’ అని ఆ చిన్నారి చెబుతుంటే కార్తీక్ మండిపడతాడు. ‘పెద్దమ్మ ఏమిటి ? పెద్దమ్మ !పేదరాసి పెద్దమ్మ లాగా ‘ అని విసవిసా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. దీంతో హిమ బేల ముఖం పెడితే.. సౌందర్య.. ‘అలా ముఖం పెడతావేమిటే ? నవ్వు’ అంటుంది. దీంతో హిమఆమెతో బాటు నవ్వుతుంది. సీన్ మారితే.. వారణాసి ఆటోలో వెళ్తున్న శౌర్య.. శ్రావ్య ఇంట్లో భాగ్యం మాటలు గుర్తుకు వఛ్చి బాధ పడుతుంది. తన తల్లి దీపకు అమ్మ లేదని తెలిసి దాదాపు కన్నీటి పర్యంతమవుతుంది.  శౌర్య రాక కోసం దీప ఇంట్లో ఎదురు చూస్తుంటుంది. శ్రావ్య ఇంట్లో శౌర్య ఏం చేస్తోందో అని మధన పడుతుంటుంది. అప్పుడే ఇంటికి వఛ్చిన శౌర్య కన్నీటిని ఆపుకోలేక.. ‘నువ్వు పుట్టగానే మీ అమ్మ ఛఛ్చిపోయిందట కదమ్మా’.. అంటుంది. దాంతో దీప కళ్ళు కూడా చెమరుస్తాయి. ‘ నాకొచ్చిన కష్టాన్ని నీ కష్టంగా మార్చుకుని ఏడుస్తావేమిటి అత్తమ్మా ‘ అంటుంది. ‘ నువ్వే లేకపోతే నేనైపోయేదాన్నో’ అని శౌర్య, ఆ చిన్నారిని ఓదార్చలేక దీప ఇద్దరూ హైరానా పడిపోతారు.  వారణాసి ప్రవేశించడంతో  సీన్ ముగుస్తుంది.

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. అప్పుడే మేడమెట్లు దిగుతున్న హిమ.. ‘డాడీ ఇలా నవ్వి చాలా రోజులైంది’ అనుకుంటూ ఇదే మాట అంటుంది. అయితే అప్పుడే అక్కడికి వఛ్చిన తల్లి సౌందర్యను చూసిన కార్తీక్.. ‘నా నవ్వులో తేడా లేదమ్మా ! మనుషుల్లోనే తేడా వస్తోంది’ అంటాడు వెటకారంగా.. కానీ.. ఎందుకో ఒక్కసారిగా ఆ తల్లీ కొడుకుల మధ్య ప్రేమ పొంగిపొరలుతుంది. ‘తల్లికి బిడ్డ ఎప్పటికీ బిడ్డే ! నువ్వు అంటావుగా  ! ఎన్నేళ్లయినా అమ్మ అమ్మే అని..’ అన్న ఆమె మాటలకు చలించిపోయిన కార్తీక్ ఆమెను కౌగలించుకుని.. ‘ఇక చెప్పొద్దు మమ్మీ ! ఉక్రోషంతో అలా అన్నాను’ అంటాడు.

ఇక స్కూలు సీన్ లో.. కాస్త హ్యూమరస్ డైలాగ్స్ అనంతరం.. ‘ఆ వంటలక్క నేను ఈ రౌడీ తండ్రినని చెప్పేసి ఉంటుందా ‘ అని కార్తీక్ అనుకుంటాడు. సంభాషణల్లో అక్కడక్కడా చమక్కులు పేలడం ఈ ఎపిసోడ్ ప్రత్యేకత.