Pawan Kalyan-Soundarya: అమ్మ , ఆవకాయ, ఎప్పుడు బోరు కొట్టవన్నట్లు.. కొంతమంది గురించి ఎన్ని సార్లు విన్నా తలచుకున్నా చిరాకు రాదు. పైగా ఇంకా ఇంకా తెలుసుకోవాలి.. వారి గురించి వినాలనిపిస్తుంది. అలంటి వ్యక్తుల గురించి ఎవరికీ ఏ సందర్భం వచ్చినా చెబుతూ ఉంటారు. తాజాగా బుల్లి తెరపై సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర .. కార్తీక దీపం సీరియల్ గురించే మాత్రమే కాదు.. హీరో పవన్ కళ్యాణ్.. దివంగత హీరోయిన్ సౌందర్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దర్శక రత్న దాసరి నారాయణ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా గోరింటాకు సినిమాతో కాపుగంటి రాజేంద్ర వెండి తెరపై అడుగు పెట్టారు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన డబ్బు భలే జబ్బు సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. తొలిప్రేమ సినిమా తర్వాత కాపుగంటి రాజేంద్ర పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలి.. అనుకోని కారణాలతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
ఇక మోహన్ బాబు , సౌందర్య హీరోయిన్లు గా తెరకెక్కిన శివశంకర్ సినిమా గురించి మాట్లాడుతూ.. సౌందర్య మరణం గురించి గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య అడిగిన రిక్వెస్ట్ ను మోహన్ బాబు కనుక అంగీకరించకపోయి ఉండి ఉంటె.. సౌదర్య మరణించేంది కాదని అన్నారు. శివశంకర్ సినిమా షూటింగ్ దాదాపు 65% పూర్తి అయ్యింది. అప్పుడు సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళడానికి మోహన్ బాబుని పర్మిషన్ అడిగింది. నిజానికి మోహన్ బాబు ఎవరైనా సినిమా మధ్యలో వెళ్తాను అంటే.. అంగీకరించారు.. కానీ సౌందర్య బతిమాలడంతో ఒకే అన్నారు.. ఆరోజు కనుక మోహన్ బాబు సౌందర్యకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఉంటె .. సౌందర్య బతికేవారు. ఆమె మరణంతో శివ శంకర్ సినిమా స్టోరీ మార్చాల్సి వచ్చింది ఆ సినిమా ప్లాప్ అయ్యింది. నా కెరీర్ కూడా ఇంపాక్ట్ అయ్యిందని తెలిపారు.
గ్లామర్ హీరోయిన్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా కట్టుబొట్టు నిండైన దుస్తులతో స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినీ రంగాన్ని ఏలింది సౌందర్య. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఓ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకానికి చేరుకుంది. అయినప్పటికి తాను నటించిన సినిమాలతో ధ్రువతారగా వెలుగుతోంది.
Also Read: Litchi Fruit Benefits: బరువు ఈజీగా తగ్గాలనుకుంటున్నారా.. ఐతే ఈ పండ్లను తింటే సరి