Sapthami Gowda: కాంతార బ్యూటీకి క్రేజీ అఫర్.. తెలుగులో ఆ స్టార్‌తో రొమాన్స్

కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. కన్నడలో సప్తమి గౌడ 'పాప్‌కార్న్ మంకీ టైగర్' సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ' కాంతార ' సినిమాలో ఛాన్స్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది సప్తమి.

Sapthami Gowda: కాంతార బ్యూటీకి క్రేజీ అఫర్.. తెలుగులో ఆ స్టార్‌తో రొమాన్స్
Kantara

Updated on: Apr 15, 2024 | 10:26 AM

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే.. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో కాంతారా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆ అమ్మడి పేరు సప్తమి గౌడ. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. కన్నడలో సప్తమి గౌడ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘ కాంతార ‘ సినిమాలో ఛాన్స్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది సప్తమి.

ఇప్పుడు సప్తమి గౌడ ఓ తెలుగు సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ‘కాంతార’ సినిమాతో సప్తమి గౌడకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ‘ది వాక్సిన్ వార్’ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమైన సప్తమి ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టనుంది.

సప్తమి గౌడ ఇటీవల మాట్లాడుతూ.. తెలుగు సినిమాలో ననటిస్తున్నాను అని తెలిపింది. నితిన్‌ సినిమాలో నటిస్తున్నాను. సినిమా షూటింగ్ కూడా మొదలైంది. నేను వెళ్లి సెట్‌లో జాయిన్ అవ్వాలి’ అని సప్తమి గౌడ తెలిపింది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ సినిమా కోసం సప్తమి గౌడ గుర్రపు స్వారీ నేర్చుకుంది. దీని గురించి కూడా సప్తమి మాట్లాడింది. ‘నేను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. పూర్తిగా నేర్చుకోలేదు. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను’ నా పాత్ర గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అని చెప్పుకొచ్చింది. మరి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక, శ్రీలీలలా ఈ అమ్మడు కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

సప్తమి గౌడ.. ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

సప్తమి గౌడ..  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.