ఇతర బాషల సినిమాలు కూడా మనదగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే అది ఏ భాష సినిమా అయినా సరే మన టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే తమిళ్, మలయాళ, కన్నడ బాషల నుంచి చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో కాంతార సినిమా ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ‘కాంతార’ సినిమా విజయంతో రిషబ్ శెట్టికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రిషబ్ శెట్టికి.. ఇప్పుడు వివిధ భాషా చిత్రాల నుంచి అనేక అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రిషబ్ ఓ సినిమాలో నటిస్తాడని వార్తలొచ్చాయి.
ఆ తర్వాత తెలుగులో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ‘జై హనుమాన్’లో రిషబ్ నటించడం కన్ఫర్మ్ అయి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు రిషబ్ శెట్టికి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక జై హనుమాన్ సినిమాలో రిషబ్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా కనిపించారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే రీసెంట్ గా రిషబ్ శెట్టి పై ఫిర్యాదు చేశారు కొందరు. హనుమంతుడి రూపురేఖలు లేకుండా పోస్టర్ ను విడుదల చేసి మనోభావాలను దెబ్బతీశారని కొందరు ఆరోపించారు. కాగా రిషబ్ శెట్టి లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొడవాటి జుట్టుతో కనిపించారు రిషబ్. అయితే ఈ లుక్ కాంతార 2 కోసం అని కొందరు, కాదు జై హనుమాన్ సినిమా కోసం అని మరికొందరు వాదించుకుంటున్నారు.ఏది ఏమైనా రిషబ్ లుక్ మాత్రం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి