డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు కన్నడ హీరో యశ్ (Yash). ఈ మూవీతో దేశవ్యాప్తంగా యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. యశ్ నటనక ప్రశంసలు కురిపించారు. ఇక ఈ చిత్రానికి సిక్వెల్‌గా ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కేజీఎఫ్ 2 (KGF 2) పై అంచనాలను మరింత పెంచేశాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది. మరోవైపు థియేటర్ల వద్ధ ఇప్పటికే యశ్ అభిమానులు హంగామా షూరు చేశారు. యశ్ భారీ కటౌట్స్, బ్యానర్లతో సందడి చేస్తున్నారు. తాజాగా మలూరులోని యశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తమ ఫేవరేట్ హీరోకు ప్రేమను సరికొత్తగా వ్యక్తం చేశారు. దాదాపు 20 వేల 7 వందల పుస్తకాలను ఉపయోగించి ఒక పెద్ద మొజాయిక్ పోర్ట్రెయిట్ రూపొందించారు.
దాదాపు 20,700 పుస్తకాలతో రూపొందించిన పోర్ట్రెయిట్ 130 x 190 అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని మలూరులోని వైట్ గార్డెన్స్ గ్రౌండ్లో 25,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు. ముందుగా దీనిని 120x 170 అడుగుల కోసం ప్లా్న్ చేసామని.. కానీ క్రమంగా అది వారి అంచనాలకు మించిపోయి.. 130 x 190 అడుగుల విస్తీర్ణానికి పెరిగిపోయిందని వారు తెలిపారు. ఇది 25,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రపంచ రికార్డ్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న ఘనంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు.
ట్వీట్..
Big Bigger Biggest!!
We had planned for 120×170ft but it surpassed our expectations… We had to expand it to 135×190ft which covers an area of 25,650 Sqft which is the world record ?️@TheNameIsYash#YashBOSS #KGF2 #KGFChapter2 pic.twitter.com/qJf0G0NhrK— Team Yash FC (@TeamYashFC) April 11, 2022
Also Read: Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..
Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?
Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..