AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiccha Sudeep : హ్యాట్సాఫ్ సుదీప్..! గౌరవ డాక్టరేట్ నిరాకరించిన హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న జనం

కన్నడ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించడం నిజంగాగొప్ప విషయం అనేచెప్పాలి. ఇక సుదీప్ హీరోగా నటించినసినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తున్న సుదీప్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.

Kiccha Sudeep : హ్యాట్సాఫ్ సుదీప్..! గౌరవ డాక్టరేట్ నిరాకరించిన హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న జనం
Kiccha Sudeep
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2024 | 9:24 AM

Share

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ నటుడు కిచ్చ సుదీప్. ఈగ సినిమాలోవిలన్ గా నటించి మెప్పించాడు. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించడం నిజంగాగొప్ప విషయం అనేచెప్పాలి. ఇక సుదీప్ హీరోగా నటించినసినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తున్న సుదీప్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. సుదీప్ చేసిన మంచి పనులకు తుమకూరు విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే దీనిని కిచ్చా సుదీప్ నిరాకరించాడు. కిచ్చా సుదీప్ కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీప్ డాక్టరేట్ ఎందుకు నిరాకరించాడంటే..

కిచ్చా సుదీప్‌కు తుమకూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. వివి సిండికేట్ సమావేశంలో జరిగిన చర్చను సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్శిటీ నిర్ణయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన సుదీప్.. దానిని నిరాకరించాడు. ‘సమాజానికి సేవ చేసిన వాళ్లు నాకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి డాక్టరేట్ ఇప్పించండి’ అని సుదీప్ అభ్యర్థించాడు.

వినోదం, నటనతోపాటు సుదీప్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సుదీప్ పీఏ ద్వారా పంపించారు. అయితే సుదీప్ మాత్రం దీనిని నిరాకరించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. వాటర్ స్పోర్ట్స్ సాహసికుడు, సామాజిక కార్యకర్త సి.ఎస్. నాగనందన స్వామి, పారిశ్రామికవేత్త హెచ్. రాజన్నహళ్లి వాల్మీకి గురుపీఠానికి చెందిన జి.చంద్రశేఖర్, అలాగే వాల్మీకి ప్రసన్నానంద స్వామీజీలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి