
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ నటి విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ 42 ఏళ్ళ వయసులో తన భర్తకి విడాకులు ఇచ్చేసిందన్న వార్త సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. నాలుగుళ్ళ క్రితమే ఈ అమ్మడుకి వివాహం జరిగింది. భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? శుభా పూంజా ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ, తమిళ్ ఆడియన్స్ కు పరిచయం ఈ అమ్మడు.
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నటిగా మారింది శుభా పూంజా. కన్నడలో మొగ్గిన మనసు చిత్రంలో రాధిక పండిట్‌తో పాటు ప్రధాన పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది, దీని కోసం ఆమె కన్నడలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. 2003లో తన కెరీర్‌ను ప్రారంభించి, రెండు దశాబ్దాలలో దాదాపు 50 సినిమాలు పూర్తి చేసింది. సినిమాలతో పాటు టెలివిజన్ లోనూ రాణించింది. అలాగే పలు యాడ్స్ లోనూ కనిపించింది. కన్నడ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 8 లో పాల్గొంది.
శుభాపూంజా బిగ్ బాస్‌లో చేరిన తర్వాత, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సుమంత్ బిల్లవ ను జనవరి 2022లో వివాహం చేసుకుంది. 42 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిందని తెలుస్తుంది. నాలుగేళ్లు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తుంది. దాంతో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి