Upendra: ఆస్పత్రిలో చేరిన కన్నడ స్టార్‌.. ఫ్యాన్స్‌లో టెన్షన్‌.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఉప్పీ

ఉప్పీ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే డస్ట్‌ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Upendra: ఆస్పత్రిలో చేరిన కన్నడ స్టార్‌.. ఫ్యాన్స్‌లో టెన్షన్‌.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఉప్పీ
Upendra
Follow us

|

Updated on: Nov 25, 2022 | 9:26 AM

కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్‌లో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా వెంటనే బెంగళూరులోని నేలమంగళలోని హర్ష ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. కాగా ఉప్పీ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే డస్ట్‌ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ట్రీట్‌మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి సినిమా సెట్స్‌లో పాల్గొన్నాడు ఉపేంద్ర. అనంతరం తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌ స్పాట్‌లోనే ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరాడు.

కాగా ప్రస్తుతం ఉపేంద్ర నాలుగైదు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న కబ్జా చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్‌ పట్టనున్నారు ఉపేంద్ర. ఈ చిత్రానికి యూఐ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు వైరల్‌గా మారాయి. గతంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. మరి ఆ వరుసలో యూఈ కూడా చేరుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో