కమల్ హాసన్ ‘కల్కి 2898 AD’ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ రోల్ మరింతగా ఎక్కువాగా అలాగే కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డ్స్ క్రియెట్స్ చేస్తూ దూసుకుపోతుంది. అలాగే కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ చాలా గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకుసీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆస్కతికర కామెంట్స్ చేశారు.
‘రోబో’ చిత్రానికి కూడా శంకర్ దర్శకత్వం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆఫర్ రజినీకాంత్ కు వెళ్లిందట. 2010లో ‘రోబో’ సినిమా విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించారు. ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ముందుగా కమల్ హాసన్, ప్రీతి జింతాలతో ఈ సినిమా చేయాలని శంకర్ అనుకున్నారట. ఇందుకోసం కమల్ లుక్ ను కూడా ఫిక్స్ చేశారట.
ఈ విషయం గురించి కమల్ హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే రోబో 2.ఓలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రను కమల్ హాసన్‌కు కూడా ఆఫర్ చేశారట. దీన్ని కూడా ఆయన నో చెప్పారు. కమల్ మాట్లాడుతూ.. ‘నేను, శంకర్, సుజాత రాసిన ఐ రోబో నవలను సినిమాగా తీయాలని చర్చించాం. అది కూడా 90వ దశకంలో. లుక్ టెస్ట్ కూడా చేశారు. కానీ బడ్జెట్, రెమ్యూనరేషన్ వంటి అనేక సమస్యల వల్ల సినిమా ఫైనల్ కాలేదు’ అని కమల్ హాసన్ అన్నారు.
‘అప్పట్లో మార్కెట్ పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా చేయడం సరికాదనిపించింది. దాంతో సినిమా నుంచి తప్పుకున్నాను. అయినా శంకర్ దీన్ని వీడలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది పెద్ద విజయం’ అని కమల్ అన్నారు. 100 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని అనుకున్న సమయంలో ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే 2.ఓ సందర్భంలోనూ శంకర్ నన్ను సంప్రదించారు. నాకు విలన్ రోల్ ఇచ్చారు. ఇంకొన్నాళ్ళు హీరోగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నా అని ఆయనకు చెప్పాను అని కమల్ హాసన్ అన్నారు. అలా కమల్ రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.