Nandamuri Kalyan Ram: ‘అందుకే ఈ సినిమాలో మొసలిని చూపించాం’.. కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్స్..

|

Jul 29, 2022 | 6:46 AM

నందమూరి కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పటాస్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్టు కొట్టాలని చాలా కసిగా ఉన్నారు కళ్యాణ్ రామ్. తాజాగా చేస్తున్న బింబిసార సినిమా తో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

Nandamuri Kalyan Ram: అందుకే ఈ సినిమాలో మొసలిని చూపించాం.. కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్స్..
Kalyan Ram
Follow us on

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పటాస్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్టు కొట్టాలని చాలా కసిగా ఉన్నారు కళ్యాణ్ రామ్. తాజాగా చేస్తున్న బింబిసార సినిమా తో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తన కెరీర్ లో మొదటి సారి హిస్టారికల్ సినిమాలో నటిస్తున్నారు ఈ యాక్షన్ హీరో. కెరీర్ బిగినింగ్ నుంచే ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చారు కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటిస్తున్న బింబిసార సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్ అదుర్స్ అనిపించాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్లు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. త్రిగర్తల సామ్రాజాధినేత బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.

హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. చాలా కాలంగా ఎలాంటి సినిమా చేయాలనీ చేస్తున్నానో అలాంటి కథనే దర్శకుడు వశిష్ఠ వినిపించాడు. కథ మొత్తం విన్నతర్వాత కచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అన్నారు కళ్యాణ్ రామ్. నేను ఇంతవరకు ఇలాంటి ఈగో ఉన్న క్యారెక్టర్ ను చేయలేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.. నా చివరి సినిమాకు నేను 88 కేజీలు ఉన్న ఈ సినిమా కోసం 75 కేజీలకు తగ్గాను అన్నారు కళ్యాణ్ రామ్. సాధారణంగా రాజులు అంటే  పులులు, సింహాలు పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాం.. అందుకు బిన్నంగా ఉండాలనే ఈ సినిమాలో బింబిసారుడు మొసలిని పెంచుకుంటూ ఉంటాడు. ఈ సినిమా నా కెరీర్ లోనే పెద్ద సినిమా.. 135 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం అన్నారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం కీరవాణి గారి దగ్గరకు వెళ్లాలంటే చాలా టెన్షన్ పడ్డం.. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన ఆయన మన సినిమాను ఓకే చేస్తారా అని కంగారు పడ్డం కానీ అయన కథావినగానే ఓకే అన్నారు. అప్పుడే సగం సక్సెస్ అయ్యాం అనిపించింది అని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి