Amigos: ఓటీటీలో అదరగొడుతోన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ..

|

Apr 18, 2023 | 7:58 AM

రిలీజ్‌ అయిన వెంటనే ప్లాప్ టాక్ వచ్చేలా చేసుకుంది. కానీ ఇదే సినిమా.. ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది

Amigos: ఓటీటీలో అదరగొడుతోన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ..
Amigos
Follow us on

కళ్యాణ్ రామ్ త్రిబుల్ యాక్షన్ సినిమాగా.. మోస్ట్ అవేటెడ్ సినిమాగా నామ్ కమాయించిన అమిగోస్.. థియేటర్లో సరైన రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. రిలీజ్‌ అయిన వెంటనే ప్లాప్ టాక్ వచ్చేలా చేసుకుంది. కానీ ఇదే సినిమా.. ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

డెబ్యూ డైరెక్టర్‌ రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో.. యాక్షన్ థిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 1 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. స్ట్రీమ్‌ అవడమే కాదు.. అక్కడ సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను రాబడుతోంది. దాదాపు రెండు వారాలు.. నెట్‌ ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్ సినిమాల లిస్టులో .. స్థానం దక్కించుకుంది. త్రూ ఓటీటీ వేదికగా అందరికీ చేరువైంది.

ఇక ఇదే విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ హ్యండిల్లో పోస్ట్ చేశారు అశికా రంగనాథ్‌. షేర్ చేయడమే కాదు.. అమిగోస్ ఈ రేర్‌ ఫీట్ చేయడం పై ఆమె ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పుడీ ట్వీట్తో నెట్టింట వైరల్ అవుతూనే.. అమిగోస్‌ థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.