Acharya movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో కాజల్ మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ కు జోడిగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాలో చరణ్ , చిరు ఇద్దరు నక్సల్స్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. అటు రామ్ చరణ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చెర్రీ ఒకేసారి రెండు మూవీ షూటింగ్‌లలో పాల్గొంటు ఫుల్ బిజీ ఆయిపోయాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపించనుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మే 13న థియేటర్లలోఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. చేతికి ఎర్ర రుమాలు తో థాంసప్ సింబల్ ఉన్న ఒక చేతి ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి. అభిమాన నటుడితో కలిసి నటించడానికి ఎంతో ఆతృతగా ఉన్న అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెవ్వరు మెగాస్టార్ చిరంజీవి అంటూ కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. ఇప్పుడు ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Shooting with my most favourite person. Guess who? ? pic.twitter.com/S29R2QDqsk
— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 20, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Mosagallu Movie : మంచు – కొణిదెల ఫ్యామిలీ బాండ్… విష్ణుకు బాసటగా నిలిచిన రాం చరణ్
Sonu Sood: సోనూ భాయ్‌కు అరుదైన గౌరవం.. ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ రియల్ హీరో..(Photo Gallery)
Raashi Khanna New Pics: గోల్డ్ కలర్‌లో మెరిసిన రాశి ఖన్నా.. చూస్తే కుర్రాళ్లు మతులు పోయినట్లే.!