బాలయ్య‌కు, పవన్‌కు విషెస్ తెలిపిన చందమామ.. అందుకే ప్రజలు ప్రేమించారంటూ..

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన తరపున నిలబడిన అందరు అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంనుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విన్ అయ్యారు. దాంతో అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల్లో గెలిచినా వారికి అభినందనలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విజయం పై సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలయ్య‌కు, పవన్‌కు విషెస్ తెలిపిన చందమామ.. అందుకే ప్రజలు ప్రేమించారంటూ..
Kajal

Updated on: Jun 06, 2024 | 11:33 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ విజయంపై పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన తరపున నిలబడిన అందరు అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంనుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విన్ అయ్యారు. దాంతో అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల్లో గెలిచినా వారికి అభినందనలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విజయం పై సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ బాలకృష్ణ కు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.

కాజల్ అగర్వాల్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో బాలయ్య గురించి కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. బాలకృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ కు ఆమె అభినందనలు తెలిపారు. బాలయ్య గారు, మీ గొప్ప విజయానికి అభినందనలు అంటూ కాజల్ ట్వీట్ చేసింది. కాజల్ అగర్వాల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో మీ కృషి, నిబద్ధత అలాగే దూరదృష్టి వల్ల ప్రజల నుంచి మీకు ఈ ప్రేమ లభించిందని కాజల్ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ పోస్ట్‌ ను తెగ షేర్ చేస్తున్నారు. మా హీరోను అభినందించినందుకు ధన్యవాదాలు’ అంటూ కాజల్ పెట్టిన పోస్ట్ పై బాలయ్య అభిమానులు రీ ట్వీట్ చేస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కూడా కాజల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. కాజల్ కూడా అతడిని అభినందించింది.

పవన్ కళ్యాణ్ పై కాజల్ ట్వీట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.