Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా

గుత్తా జ్వాలా తమిళ యువహీరో విష్ణు విశాల్ ప్రేమలో తేలిపోతున్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి

Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా
Gutta Jwala Vishnu Vishal

Updated on: Apr 13, 2021 | 3:15 PM

Jwala Gutta and Vishnu Vishal: గుత్తా జ్వాలా తమిళ యువహీరో విష్ణు విశాల్ ప్రేమలో తేలిపోతున్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతుంది. ఇప్పటికే ఈ  ఇద్దరి ప్రేమప్రయాణం పై మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక 2021 లో ముహుర్తాలు చూసుకొని ఈ ప్రేమపావురాలు ఒక్కటవ్వబోతున్నారని ఆ మధ్య టాక్ కూడా నడిచింది. ఇప్పటికే విష్ణు విశాల్ మొదటి భార్యనుంచి విడాకులు తీసుకొని పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇక గుత్తా జ్వాలకు కూడా ఇది రెండో వివాహమే.

తాజాగా తమ వివాహానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది గుత్తా జ్వాలా. ఏప్రిల్ 22 ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ మేరకు జుత్తా జ్వాలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. “మా ఇరు కుటుంబాల ఆశీసులతో మేము పెళ్లి చేసుకోబోతున్నాం” అంటూ రాసుకొచ్చింది.  గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viraata Parvam : గుమ్మానికి పసుపు రాస్తున్న అమ్మాడి.. ‘విరాటపర్వం’ నుంచి పోస్టర్ రిలీజ్

Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

Mohan Babu : డైనమిక్ లుక్ లో అదరగొడుతున్న కలక్షన్ కింగ్.. సన్ ఆఫ్ ఇండియా మూవీ నుంచి మరో పోస్టర్..