Aha OTT: ‘ఆహా’ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు.. ఇతర భాషల్లోకి కూడా’.. తొలి వార్షికోత్సవ వేడుకలో రాము రావు జూపల్లి.

|

Feb 08, 2021 | 9:31 PM

Aha First Anniversary: ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. తెలుగులో తొలి ఓటీటీగా దూసుకొచ్చింది ‘ఆహా’. వినూత్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు, టాక్ షోలతో నెం1 దిశగా దూసుకెళుతోన్న అచ్చ తెలుగు ‘ఆహా’...

Aha OTT: ‘ఆహా’ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు.. ఇతర భాషల్లోకి కూడా’.. తొలి వార్షికోత్సవ వేడుకలో రాము రావు జూపల్లి.
Follow us on

Aha First Anniversary: ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. తెలుగులో తొలి ఓటీటీగా దూసుకొచ్చింది ‘ఆహా’. వినూత్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు, టాక్ షోలతో నెం1 దిశగా దూసుకెళుతోన్న అచ్చ తెలుగు ‘ఆహా’కు సోమవారంతో (ఫిబ్రవరి 8) ఏడాది ముగిసింది. కేవలం సంవత్సర కాలంలోనే కోట్ల సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించిన ‘ఆహా’.. మూడు వెబ్ సిరీస్‌లు నాలుగు సినిమాలు అన్నట్లు తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది.
ఇదిలా ఉంటే ‘ఆహా’ మొదటి వార్షికోత్సవ వేడుకలను సోమవారం హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ వ్యవస్థాపకుల్లో ఒకరైన జూపల్లి రాము రావు మాట్లాడారు. ‘ఆహా’ ఇంతలా విజయవంతం కావడంతో ముఖ్య పాత్ర పోషించిన వారికి మనస్ఫూర్తిగా కృత‌జ్ఞతలు తెలియజేశారు. కేవలం ఏడాది కాలంలోనే ‘ఆహా’ 8.5 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు జరిగాయని తెలిపారు. కేవలం తెలుగు భాషకే పరిమితమై ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతమవడం నిజంగా అద్భుతమని రాము అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీ యాప్‌లలో ఆహానే నెం1 అని గర్వంగా చెప్పగలనన్నారు. ‘ఆహా’ ప్రయాణం ఇంతటితోనే ఆగదని.. ఇతర భాషల్లోకి కూడా వెళుతుందని చెప్పారు. ఏడాది కాలంగా ‘ఆహా’కు మద్ధతుగా నిలిచిన మీడియాకు, ప్రేక్షకులకు రాము రావు ధన్యవాదాలు తెలిపారు. రాము రావు మాట్లాడిన తీరు చూస్తుంటే.. తెలుగులో సంచలనాలు సృష్టిస్తోన్న ‘ఆహా’ త్వరలోనే ఇతర భాషల్లోనూ అలరించనుందని స్పష్టమవుతోంది.

Also Read: Krithi Shetty: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న ‘ఉప్పెన’ భామ.. అక్కినేని హీరోతో జతకట్టనున్న బ్యూటీ..?