Jr NTR : హమ్మయ్య..! ఇండియాకు సేఫ్‌గా తిరిగివచ్చిన ఎన్టీఆర్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

|

Jan 02, 2024 | 11:13 AM

ఇప్పటికే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల తారక్ ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. సతీసమేతగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి తారక్ జపాన్ వెళ్లారు. అయితే అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.

Jr NTR : హమ్మయ్య..! ఇండియాకు సేఫ్‌గా తిరిగివచ్చిన ఎన్టీఆర్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
Ntr
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల తారక్ ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. సతీసమేతగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి తారక్ జపాన్ వెళ్లారు. అయితే అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.

జపాన్ లో భారీగా భూకంపాలు సంభవించాయి. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలితో అక్కడ ఉండటంతో అభిమానులు అందాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సేఫ్ గా ఉండాలని కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాను సేఫ్ గా ఇండియాకు తిరిగి వచ్చాను అని తారక్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ ను షేర్ చేశారు.

తారక్ ట్వీట్ చేస్తూ.. సేఫ్ గా ఇండియాకు తిరిగి వచ్చాము.. కానీ జపాన్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగావుంది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. దాంతో అభిమానులు ఉపిరిపీల్చుకున్నారు. ఇక దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న దేవర మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.