AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఏనాడో అనుకుందే.. ఆస్కార్‌ రేస్‌కు అడుగు దూరంలో అన్నగారి మనవడు

ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలే.. మరి ఆస్కార్ రేసులో కేవలం ఎన్టీఆర్ పేరు మాత్రమే ఎందుకు వినిపిస్తుంది..? సినిమా అంతా లీడ్ చేసినా.. చరణ్‌కు రాని గుర్తింపు కేవలం కొన్ని సన్నివేశాలతోనే తారక్‌కు ఎందుకొచ్చింది..? అకాడమీ సభ్యుల్ని అంతగా కట్టి పడేసిన సీన్స్ ఏంటి..?

Jr NTR: ఏనాడో అనుకుందే..  ఆస్కార్‌ రేస్‌కు అడుగు దూరంలో అన్నగారి మనవడు
Jr NTR in RRR
Ram Naramaneni
|

Updated on: Jan 21, 2023 | 3:54 PM

Share

అదేంట్రా.. మన ఎన్టీఆర్‌కు రాజమౌళి అంత అన్యాయం చేసాడు..? మొత్తం కథ అంతా రామ్ చరణ్ చుట్టూనే నడిపించేసాడేంట్రా..? ఎంతైనా ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగింది. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన కొత్తలో తారక్ కారెక్టర్ గురించి ఆయన అభిమానులు మాట్లాడుకున్న మాటలివే. అందులో నిజం కూడా లేకపోలేదు.. అన్యాయం జరిగిందో లేదో తెలియదు కానీ ట్రిపుల్ ఆర్ కథ నడిపించేది మాత్రం చరణ్ అనడంలో సందేహం లేదు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినపుడు హెచ్చు తగ్గులు కచ్చితంగా ఉంటాయి. మా హీరోను తగ్గించారు.. ఆ హీరోను పెంచారు అనే వాదనలు కూడా జరుగుతాయి. కానీ అక్కడ రాజమౌళి ఉన్నాడు కాబట్టి RRR విషయంలో ఇలాంటి మాటలు తక్కువగానే వినిపించాయి. అయితే ఆస్కార్‌ అవార్డుల దగ్గరికి వచ్చేసరికి.. కొన్ని రోజులుగా కేవలం ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తుంది.. చరణ్ అందులో కనిపించడం లేదు.

ఇండియాలో చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరి నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. అదే గ్లోబల్ ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యంగా మూడు సన్నివేశాలే కారణం అని తెలుస్తుంది. రామ్ చరణ్ సినిమా అంతా లీడ్ చేసినా.. పులితో ఎంట్రీ సీన్, ఇంటర్వెల్‌లో జంతువులతో వచ్చే ఇంట్రో సీన్, సెకండాఫ్‌లో కొమరం భీముడో పాటతో అకాడమీ సభ్యుల్ని తారక్ తన వైపు తిప్పుకున్నట్లు తెలుస్తుంది.

ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్‌కు పడిన ఈ మూడు సీన్స్ ఆస్కార్స్‌లో చర్చకు తెర తీసాయని.. అందులో తారక్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు వాళ్లు ఫిదా అయిపోయారని ప్రచారం జరుగుతుంది. జనవరి 24న ప్రకటించబోయే ఆస్కార్స్ బెస్ట్ యాక్టర్ షార్ట్ లిస్టులో NTR పేరు ఖాయమని వెరైటీ మ్యాగజైన్ కూడా రాసుకొచ్చింది. అమెరికా వెబ్‌సైట్.. ‘USA Today’ సైతం ఇదే విషయాన్ని రాసుకొచ్చింది. ఒకవేళ అదే నిజమై.. తారక్ ఆస్కార్ రేసులో నిలిస్తే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?
పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?