
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం (మే24) తుదిశ్వాస విడిచారు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముకుల్ దేవ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆ్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే నటుడి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అదుర్స సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు ముకుల దేవ్. గ్యాంగ్ లీడర్ రసూల్ గా మెప్పించారు. ఈ క్రమంలో ముకుల్ దేవ్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ‘ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఎన్టీఆర్
తెలుగుతో పాటు హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించారు ముకుల్ దేవ్. రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో మెయిన్ విలన్ గా ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమాలోనూ ముకుల్ దేవ్ నటించారు. వీటితో పాటు సిద్ధం, కేడి, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువయ్యారు. ప్రముఖ విలన్ రాహుల్ దేవ్ కు ఇతను స్వయానా సోదరుడు. ఈ క్రమంలోనే ముకుల్ అంతిమ సంస్కారాలను దగ్గరుండి చూసుకున్నారు రాహుల్.
Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I
— Jr NTR (@tarak9999) May 24, 2025
Rest in peace my brother #MukulDev ! The time spent with you will always be cherished and #SonOfSardaar2 will be your swansong where you will spread joy and happiness to the viewers and make them fall down laughing ! pic.twitter.com/oyj4j7kqGU
— Vindu Dara Singh (@RealVinduSingh) May 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి