
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 14న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి కారణం కథ, ఇతర విషయాలు కాదు.. నువ్వు ఈ సినిమా చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు అన్నారు.
“ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండగ జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతపెట్టిన నాగవంశీకి థాంక్స్. 13 ఏళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్ లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా. ఈ సినిమా నువ్వు చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీస్తానుఅని చెప్పి.. నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థాంక్స్. నన్ను యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లోకి తీసుకున్నందుకు థాంక్స్. నన్ను ముంబైలో జాగ్రత్తగా, కుటుంబంలా చూసుకున్నందుకు.. YRF టీమ్ మొత్తానికి థాంక్స్. అయాన్ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమా వేడుకకు నేను అతిథిగా రావాల్సింది. కొన్ని కారణాలతో నేను రాలేకపోయాను. అప్పుడు అయాన్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు నా దర్శకుడిగా వచ్చాడు. ఇద్దరు స్టార్స్‌ను పెట్టుకుని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం. మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.
25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ కో సినిమా చూసినప్పుడు హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. 25 ఏళ్ల తర్వాత ఆయన పక్కన ఆయనతోపాటు యాక్ట్ చేయడానికి.. ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు.. హృతిక్ రోషన్ ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో ‘హృతిక్ రోషన్’ ఒకరు. భారతదేశంలో ఆయన గొప్ప డ్యాన్సర్. ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్ చేస్తున్న తెలుగు మూవీ కూడా. 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే అభిమాని.. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి..కానీ వాటిని మీరు బయటకు పెట్టకండి. దయచేసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం. మళ్లీ వార్ 2 సక్సెస్ మీట్ కు కలుద్దాం” అని అన్నారు ఎన్టీఆర్.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?