సీనియర్ హీరో రాజశేఖర్(Rajasekhar) హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ శేఖర్. రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం. స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా శేఖర్ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా శేఖర్ అన్నారు. కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ సఫ్ఫరింగ్ ను ఇందులో చూస్తారు.. ప్రేక్షకులు ఎప్పుడు ఎమోషన్ ఫిలిమ్స్ ఆదరిస్తూ వస్తున్నారు. గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి, దగ్గర్నుంచి రాజశేఖర్ గారి చాలా సినిమాలను ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాలకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అవుతారు. ఈ సినిమాలో రాజశేఖర్ గారి కూతురు పాత్రలో శివాని నటించింది, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాయి అన్నారు. అలాగే ఈ శేఖర్ సినిమా మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది.ఈ శేఖర్ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులకు,టెక్నిషియన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాము. మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :