
నటుడు జేడీ చక్రవర్తి.. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. ఒకానొక సమయంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు జేడీ చక్రవర్తి. శివ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగుతో పాటు తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొంతకాలం విలన్ గా మెప్పించిన ఆయన ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించాడు. కొంతకాలంగా ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. దివంగత నటి శ్రీదేవి తల్లి జేడీని శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగిన ఒక గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఆయన పంచుకున్నారు. శ్రీదేవి కజిన్ మహేశ్వరి ఓ రోజు జె.డి. చక్రవర్తి, ఆయన తల్లిని భోజనానికి ఆహ్వానించారు. తన ఇల్లు దూరంగా ఉండటంతో శ్రీదేవి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారట. అయితే ఒక్కసారిగా శ్రీదేవి తల్లి జె.డి. చక్రవర్తిని చూసి “మా అమ్మాయిని పెళ్లి చేసుకో” అని అడిగారట. దాంతో ఆయన షాక్ అయ్యారట.. మాములుగా అయితే ఎగిరి గంతేసే మ్యాటర్ అది.. కానీ అసలు విషయం ఏంటంటే..
అయితే, ఆ సమయంలో శ్రీదేవి తల్లికి మెదడుకు సంబంధించిన సర్జరీ జరిగిందట, అది తప్పుగా చేయబడటం వల్ల ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆవిడ మనసులో శ్రీదేవికి ఇంకా పెళ్లి కాలేదనే భావన ఉండిపోవడం వల్ల, అలా వచ్చి జె.డి. చక్రవర్తిని పెళ్లి గురించి అడిగారట. ఈ విషయాన్నీ జేడీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అది జె.డి. చక్రవర్తి తన జీవితంలోని ఇది ఓ అరుదైన సంఘటన అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.