
సినీ నటి జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటి ఆవిడ. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరగాని ముద్ర వేశారు జయసుధ. సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలకు జయసుధ తల్లిగా నటించారు. అయితే గతంలో కంటే ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదు. ఈక్రమంలోనే గతంలో ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నటి జయసుధ గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ఎన్.టి. రామారావులతో తన అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కృష్ణను అందగాడిగా అభివర్ణించిన ఆమె, ఆయన తక్కువగా మాట్లాడే వ్యక్తి అని అన్నారు. అయితే శోభన్ బాబును చార్మింగ్ వ్యక్తి అని అన్నారు, మహిళలతో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు జయసుధ అన్నారు. శోభన్ బాబు సెట్స్‌లో నటీనటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, హీరోయిన్లు తమ వ్యక్తిగత సమస్యలను కూడా ఆయనతో పంచుకునే వారని జయసుధ వివరించారు. ఒక సందర్భంలో ఆయన సరదాగా, “మీరంతా మీ బాయ్‌ఫ్రెండ్ల గురించి నా దగ్గర చెప్తే, నేను మీ హీరోని కదా, ఫీల్ అవుతాను” అని అన్నట్లు గుర్తుచేసుకున్నారు. శోభన్ బాబు నటీనటులకు మంచి సలహాలు ఇస్తూ, వారిని సౌకర్యంగా ఉంచేవారని తెలిపారు.
తన కెరీర్‌లో ప్రకాష్ రాజ్‌తో కలిసి నటించిన చిత్రాలను ప్రస్తావిస్తూ, శతమానం భవతి, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి సినిమాల గురించి మాట్లాడారు. సెట్స్‌లో తాను అందరితో సరదాగా మాట్లాడేదాన్నని, అయితే కృష్ణ గారితో కొంచెం దూరం, భయంతో ఉండేదని జయసుధ తెలిపారు. ఎన్.టి. రామారావు గారితో కూడా తాను మాట్లాడేదాన్నని, అయితే వయసులో చాలా చిన్నదానిగా ఆయనతో మొదట్లో భయం ఉండేదని చెప్పారు. తన తొలి తరం హీరోలు శోభన్ బాబు వరకు తన తండ్రి కంటే పెద్దవారని ఆమె వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.