యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఆయన నటనకు, ఆయన డాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ సినిమా ఏది విడుదలైనా ఆయన నటన పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ మంత్రి తారక్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న జపాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి యోషిమాసా హయాషి మీడియాతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా సినిమాలు.. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు జపాన్ లో మంచి క్రేజ్ తెచుకుంటున్నాయి అని తెలిపారు.
అలాగే మంత్రి యోషిమాసా హయాషి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో రికార్డులు క్రియేట్ చేసిందని. అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏ హీరో నచ్చాడు అన్న ప్రశ్నకు.. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని.. ఆయన నటన తనను ఆకట్టుకుందని తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జపాన్ మంత్రి ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేయడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
Minister Of Foreign Affairs Of #Japan — Mr. #YoshimasaHayashi says he liked @tarak9999 in #RRRMovie#ManOfMassesNTR #DEVARA #NTRGoseGlobal pic.twitter.com/r2AsuiHGNu
— Bangalore Nandamuri Fans (@BloreNandamuriF) July 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.