దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు శ్రీదేవిని మరోసారి గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అతిలోక సుందరి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల దారి మీదుగా కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. జాన్వీతోపాటు ఆమె ప్రియుడు శిఖర్ పహరియా కూడా ఉన్నారు. ప్రతీ ఏడాది తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది జాన్వీ. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో జాన్వీ పసుపు రంగు పట్టు చీరలో అచ్చ తెలుగమ్మాయిలా సంప్రదాయంగా కనిపిస్తుంది. అలాగే ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా పంచెకట్టులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.
శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా తన తల్లికి బర్త్ డే విషెస్ తెలుపుతూ జాన్వీ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో తల్లితో కలిసి ఉన్న చిన్నప్పటి ఫోటోతోపాటు మెట్లదారిలో తాను దిగిన ఓ ఫోటోలను కూడా పంచుకుంది. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తిరుపతి, తాను చీర కట్టినా కూడా తన తల్లికి చాలా ఇష్టమని జాన్వీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. ధడక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జాన్వీ.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇవే కాకుండా రామ్ చరణ్ కొత్త సినిమాతోపాటు తమిళంలోనూ పలు ఆఫర్స్ అందుకుంటుంది జాన్వీ.
Our Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today 💛🤩. #Chuttamalle pic.twitter.com/FMQ5tkHcGq
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.