అతిలోక సుందరి కూతురు అతిత్వరలో తెలుగు తెరకు.. జాన్వీ ఎంట్రీకి రంగం సిద్ధంచేస్తున్న ప్రముఖ దర్శకుడు..
అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది..
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో అడుగు పెట్టాలనుకుంటుందట. ఇప్పటికే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పైన చాల వార్తలు వచ్చాయి.
అయితే టాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు జాన్వీని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ క్రియేటివ్ జీనియస్ గా పేరుతెచ్చుకున్న ఓ దర్శకుడు జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడట. అయితే జాన్వీ తండ్రి బోని కపూర్ పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :
హీరో అడుగు పెట్టనున్న మరో బడా ప్రొడ్యూసర్ కొడుకు..సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారా..?