Jailer: అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జైలర్ ప్రొడ్యూసర్

నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. దాదాపు 700 కోట్ల రూపాయిలను వసూల్ చేసింది ఈ సినిమా. ఇప్పటికి కూడా జైలర్ మూవీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో జైలర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Jailer: అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జైలర్ ప్రొడ్యూసర్
Anirudh

Updated on: Sep 05, 2023 | 11:19 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా సంచలన హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. దాదాపు 700 కోట్ల రూపాయిలను వసూల్ చేసింది ఈ సినిమా. ఇప్పటికి కూడా జైలర్ మూవీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో జైలర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

ఇది జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ మూవీ ప్రొడ్యూసర్ చిత్రయూనిట్ కు గిఫ్ట్స్ ఇస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే 100 కోట్ల రూపాయిల చెక్ కూడా ఇచ్చారని టాక్ ఉంది. అలాగే దర్శకుడు నెల్సన్ దిలీప్ కు కూడా నిర్మాత కళానిధి మారన్ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ ను కూడా గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేశారు కళానిధి మారన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.