Tollywood: నా కూతురు పెళ్లైపోయిందోచ్..! రెండో కూతురు పెళ్లి కబురుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ నటుడు

టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ ఉన్న ఫ్యామిలీ హీరో ఆయన. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మహిళా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటుడు, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఊహించని రీతిలో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఈ ..

Tollywood: నా కూతురు పెళ్లైపోయిందోచ్..! రెండో కూతురు పెళ్లి కబురుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ నటుడు
Senior Actor And Senior Hero

Updated on: Dec 23, 2025 | 8:48 AM

టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ ఉన్న ఫ్యామిలీ హీరో ఆయన. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మహిళా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటుడు, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఊహించని రీతిలో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఈ సీనియర్ హీరో తన ఇంట్లో జరగబోయే ఒక పెద్ద శుభకార్యం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన కూతురు పెళ్లి జరిగిందంటూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో అభిమానులంతా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే హడావుడి, ఆర్భాటం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సీనియర్ హీరో మాత్రం చాలా సింపుల్‌గా, సోషల్​ మీడియా వేదికగా ఈ వేడుకను జరుపుకున్నారు. “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్​’ అంటూ ఓ వీడియో షేర్​ చేశారు. ఆ వీడియోలో చూపించినట్లు ఆ హీరో రెండో కూతురు నిజంగానే పెళ్లి చేసుకుందా? లేకపోతే ఆయన సరదాగా ఆ వీడియో షేర్​ చేశారా అని నెట్టింట రచ్చ మొదలైంది. అభిమానులను ఇలా సస్పెన్స్​లో పెట్టేసిన హీరో ఎవరో కాదు.. జగపతి బాబు.

Jagapathi Babu

జగపతి బాబు మొదటి కుమార్తె పెళ్లిని నిరాడంబరంగా విదేశీయుడితో జరిపించిన విషయం మనందరికీ తెలిసిందే. జగ్గూభాయ్​ రెండో ఇన్నింగ్స్​లో విలన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అయితే జగపతిబాబు ఏం చేసినా ఒక వెరైటీ ఉంటుంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో సినీ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వీడియో నిజమైనది కాదు.. అది కేవలం ఏఐ(AI)తో రూపొందించిన ఒక క్రియేటివ్ వీడియో! టెక్నాలజీ ఎంతగా ఎదిగిందో చూపిస్తూనే, తన ఫ్యాన్స్‌ను సరదాగా ఆటపట్టించడానికి ఆయన ఈ పని చేశారని తెలుస్తోంది.


నిజానికి జగపతిబాబు తన పిల్లల పట్ల చాలా స్వేచ్ఛగా ఉంటారు. గతంలో ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో తన రెండో కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన రెండో కూతురికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. “నా పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో అది వారి ఇష్టం. పెళ్లి అనేది వారి ఛాయిస్, నేను ఎప్పుడూ ఒత్తిడి చేయను” అని చెప్పడం ద్వారా ఆయన ఎంత గొప్ప తండ్రో నిరూపించుకున్నారు.

పెళ్లి కబురు అని సంబరపడ్డ అభిమానులకు ఇది ఒక స్వీట్ షాక్ అనే చెప్పాలి. సాంకేతికతను వాడుకుని అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, తన కూతురి ఇష్టానికి విలువిచ్చే తండ్రిగా జగపతిబాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. మొత్తానికి ఈ ‘ఏఐ’ పెళ్లి కబురు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.