
నందమూరి అభిమానుల చూపంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది. బాలయ్యను అభిమానులకు ఎలా కావాలో అలా చూపించడంలో ఇప్పటికే బోయపాటి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాను భారీవిజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా వస్తున్న అఖండ సినిమాకోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖండ సినిమా క్లైమాక్స్‌ను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ షెడ్యూల్‌ను తమిళ్ నాడు షూట్ చేస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లజూ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో కనిపించనున్నారు. వారిలో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల భామ ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు అఖండలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే హీరో శ్రీకాంత్ ఈ సినిమాలోప్రతినాయకుడిగా బాలయ్యను ఎదిరించనున్నాడు. అయితే జగపతిబాబు రోల్‌కు సంబంచిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘అఖండ’ చిత్రంలో జగపతి బాబు కూడా ఓ అఘోరాగా కనిపించనున్నారట. బాలయ్య కథకు జగపతి బాబు పాత్ర మార్గదర్శకంగా ఉంటుందని.. ఆయన గెటప్ కూడా ఆకట్టుకుంటుందని టాక్. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ఇక ఈ సినిమాను దసరాకి ముందు విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అఖండ సినిమాతర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నరు బాలయ్య. అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, పూరిజగన్నాథ్ డైరెక్షన్ లోనూ మూవీస్ చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :