AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శోభనం సీన్ చేసేటప్పుడు బెడ్ మీదకు రాగానే ఆ హీరోయిన్ బోరున ఏడ్చేసింది..

ప్రముఖ నటుడు జగపతిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణం, ఎదురైన అనుభవాలు, ఇతర భాషల సినీ రంగాలలో లభించే గౌరవం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు.

శోభనం సీన్ చేసేటప్పుడు బెడ్ మీదకు రాగానే ఆ హీరోయిన్ బోరున ఏడ్చేసింది..
Jagapathi Babu
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 3:33 PM

Share

ప్రముఖ నటుడు జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత అనుభవాలు, అలాగే తన ఐకానిక్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. లయతో దాదాపు 25 ఏళ్ల తర్వాత కలిసి నటించడం గురించి జగపతి బాబు ప్రస్తావించారు. మనోహరం, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలలో గతంలో కలిసి పనిచేసిన వీరు మళ్లీ చాలా కాలం తర్వాత కెమెరా ముందుకొచ్చారు. నటి లయ గురించి మాట్లాడుతూ.. లయ మనోహరం సినిమా చేసేటప్పుడు చాలా చిన్నపిల్ల అని, ఇప్పుడు అప్పటికంటే మరింత అందంగా, క్యూట్ గా ఉందని జగపతి బాబు ప్రశంసించారు. మనోహరం షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

ఒక శోభనం సన్నివేశంలో లయ బోరున ఏడ్చిందని, ఆమె బాల్యం కారణంగా అటువంటి సన్నివేశాలకు అలవాటు పడలేదని వివరించారు. ఈ అనుభవాలు తమ మధ్య ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరిచాయని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఒకసారి కలిసి పనిచేసిన ఆర్టిస్టుల మధ్య ఎప్పటికీ పాత బంధమే ఉంటుందని, అది కొత్తగా అనిపించదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

జగపతి బాబు తన ప్రత్యేకమైన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది నటులు తమ వెంట్రుకలకు రంగు వేసుకుని యువకుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తుండగా, ఆయన సహజంగా ఉండటంపై ఇంటర్వ్యూయర్ అభినందించారు. అయితే, ఈ లుక్ ఒక ప్రణాళికలో భాగం కాదని జగపతి బాబు అన్నారు. కెరీర్ లో సినిమా అవకాశాలు లేక, ఆర్థికంగా కష్టాలు పడుతున్న సమయంలో, రోజుకు ఐదు వేల రూపాయల సీరియల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులలో ఈ తెల్ల వెంట్రుకలు, గెడ్డం పెరిగిందని వివరించారు. అప్పుడు వాటిని పట్టించుకునే స్థితిలో తాను లేనని తెలిపారు. ఆ తర్వాత డిజైనర్ రామ్ సహాయంతో ఒకసారి ఫోటో షూట్ చేయగా, ఆ లుక్ దర్శకుడు బోయపాటి శీనుకు నచ్చింది. బోయపాటి ఆ లుక్ ను తన సినిమాలో ఉపయోగించారని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తరహా లుక్ ఫ్యాషన్ గా మారిందని చెప్పారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అని, తాను కావాలని చేసింది కాదని స్పష్టం చేశారు జగపతిబాబు.

ఇవి కూడా చదవండి

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us