Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు.. యాక్టింగ్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. జగపతి బాబు..
ఒకప్పుడు హీరోగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు జగపతి బాబు. అప్పట్లో అత్యధిక ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రస్తుతం విలన్, సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలుగు యంగ్ హీరోలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ ఏ హీరో గురించి ఏం చెప్పారో తెలుసుకుందామా.

జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయకుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో అటు సహయ నటుడిగా, ఇటు విలన్ పాత్రలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ‘చిట్టిబాబు’గా, జగపతి బాబు ‘ప్రెసిడెంట్ గారు’ (ఫణింద్ర భూపతి) గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు రామ్ చరణ్ గురించి, వారి మధ్య ఉన్న కాంబినేషన్ సీన్స్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
రామ్ చరణ్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ, చరణ్ ఒక కమర్షియల్ సూపర్ స్టార్ అయినప్పటికీ, ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, నటన చాలా సహజంగా ఉన్నాయని ప్రశంసించారు. సాధారణంగా ఒక స్టార్ హీరో తన ఇమేజ్ పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం కష్టమని, కానీ చరణ్ చాలా సిన్సియర్‌గా, ఎంతో అంకితభావంతో నటించారని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ తనకు చాలా నచ్చిందని.. అలాగే చిట్టిబాబు పాత్రలో చరణ్ తనకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ యువకుడిగా చరణ్ పలికించిన హావభావాలు అమోఘమని అన్నారు. సినిమాలో రామ్ చరణ్ (చిట్టిబాబు), ఆది పినిశెట్టి (కుమార్ బాబు) మధ్య వచ్చే సన్నివేశాలు తనకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చాయని జగపతి బాబు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
తన పాత్ర గురించి చెబుతూ, సుకుమార్ ఒక పాత్రను ఎలా డెవలప్ చేస్తారు , దానిని తెరపై ఎలా చూపిస్తారో వివరిస్తూ జగపతి బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ పాత్రలో ఒక రకమైన గాంభీర్యం, సైలెంట్ క్రూరత్వం ఉండేలా ప్లాన్ చేశారని, అది ప్రేక్షకులకు బాగా నచ్చిందని చెప్పారు. సుకుమార్ తన దగ్గర నుండి సహజమైన నటనను ఎలా రాబట్టుకున్నారో కూడా ఆయన వివరించారు. ‘రంగస్థలం’ రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయి లాంటి సినిమా అని, ఆయన అద్భుతమైన నటన వల్లనే సినిమా అంతటి విజయం సాధించిందని జగపతి బాబు అన్నారు. ఈ పాత్ర కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక నటుడి వ్యక్తిగత పరిణతిని, అతను తన పాత్రలో ఎంతగా లీనమవుతాడనే దానికి నిదర్శనంగా నిలిచింది. లక్షలాది మంది ప్రేక్షకులు చిట్టిబాబు పాత్రను ఆదరించి, రామ్ చరణ్ నటనను మళ్ళీ మళ్ళీ ప్రశంసించడం ఈ పాత్ర సాధించిన విజయానికి నిదర్శనం.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
