ఫైనల్‌గా అతన్ని కలిశాను..! రోహిణి పోస్ట్‌కు నెటిజన్స్ విషెస్.. కానీ ఇంతలోనే ట్విస్ట్..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ది బెస్ట్ లేడీ కమెడియన్లలో రోహిణి ముందు వరుసలో ఉంటుంది. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ రియాలిటీ షోలో సందడి చేసింది. అయితే మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్‌ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్, పాపులారిటీ వచ్చింది.

ఫైనల్‌గా అతన్ని కలిశాను..! రోహిణి పోస్ట్‌కు నెటిజన్స్ విషెస్.. కానీ ఇంతలోనే ట్విస్ట్..
Rohini

Updated on: Jan 10, 2026 | 8:46 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కమెడియన్ రోహిణి కూడా ఒకరు. లేడీ కమెడియన్ గా తన టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రోహిణి. జబర్దస్త్ కంటే ముందు అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరైంది అందాల తార. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ రెండు సార్లు పాల్గొంది రోహిణి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సివంగిగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ గేమ్ షోలో విజేతగా నిలవకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఓవైపు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూనే మత్తు వదలరా, బలగం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రోహిణి. ఇక సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది రోహిణి. ఇందులో ఆమె నటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

ఇలా టీవీ షోస్, సినిమాలతో నిత్యం బిజి బిజీగా ఉన్న రోహిణి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఫైనల్ గా అతన్ని కలిశాను అంటూ ఓ అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోను పంచుకుంది. దాంతో రోహిణికి అభిమానులు, నెటిజన్స్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. రోహిణి పక్కన ఉన్న హ్యాండ్సమ్ బాయ్ ఎవరో కాదు.. అది ఓ ఏఐ ఇమేజ్.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

తనకు ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్ జీ పీటీకి ధన్యవాదాలు అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది రోహిణి. దాంతో నెటిజన్స్ అవాక్ అవుతున్నారు. రోహిణి పోస్ట్ కు పలువురు సెలబ్రెటీలతో పాటు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సెకన్ నిజమే అనుకున్నాం అని కొందరు. మీకు ఇలాంటి అందమైన అబ్బాయి దొరకాలి అని కోరుకుంటున్నాం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.