ఓ ఇంటి వాడైన మాస్ అవినాశ్..’జబర్దస్త్’ గురూ…!

|

Feb 01, 2020 | 10:00 AM

ఎన్ని ఏళ్లు అయినా ‘జబర్దస్త్’ తన సత్తా చాటుతూనే ఉంది. రేటింగ్స్ పరంగా దూసుకెళ్తూ తనకు సాటి ఎవరూ లేరన్నట్టుగా అదరగొడుతుంది. ఇటీవలే మెగాజడ్జ్ నాగబాబుతో పాటు కొందరు కమెడియన్లు నిష్క్రమించినా..’జబర్దస్త్’లో నవ్వులకు లోటు రాలేదు. ఎంతో మంది కమెడియన్లకు తమ టాలెంట్ ప్రదర్శిచేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికైంది. చాలా మంది కార్లతో పాటు ఇళ్లు కూడా కొనుక్కున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరిపోయాడు మాస్ అవినాస్. ఓవైపు జబర్ధస్త్ కార్యక్రమం మరోవైపు ఆ షో […]

ఓ ఇంటి వాడైన మాస్ అవినాశ్..జబర్దస్త్ గురూ...!
Follow us on

ఎన్ని ఏళ్లు అయినా ‘జబర్దస్త్’ తన సత్తా చాటుతూనే ఉంది. రేటింగ్స్ పరంగా దూసుకెళ్తూ తనకు సాటి ఎవరూ లేరన్నట్టుగా అదరగొడుతుంది. ఇటీవలే మెగాజడ్జ్ నాగబాబుతో పాటు కొందరు కమెడియన్లు నిష్క్రమించినా..’జబర్దస్త్’లో నవ్వులకు లోటు రాలేదు. ఎంతో మంది కమెడియన్లకు తమ టాలెంట్ ప్రదర్శిచేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికైంది. చాలా మంది కార్లతో పాటు ఇళ్లు కూడా కొనుక్కున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరిపోయాడు మాస్ అవినాస్. ఓవైపు జబర్ధస్త్ కార్యక్రమం మరోవైపు ఆ షో ఫేమ్ ద్వారా వచ్చే ఈవెంట్లు ద్వారా చేతినిండా సంపాదన ఉండటంతో ఈ స్టేజ్ కమెడియన్లు అందరూ ఇళ్లు కొనుక్కుంటున్నారు.

ఓ చిన్న ఛాన్స్‌తో స్టార్టయి..ముందు కంటెస్టెంట్స్‌గా రాణించి, ఆ తర్వాత తన ఫ్రెండ్ కార్తీక్‌తో కలిసి ఇప్పడు ఓ టీమ్‌కే సారథ్యం వహిస్తున్నాడు అవినాశ్. మిమిక్రీ.. అవినాశ్‌కు అన్నం పెడితే..జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. ఇక ఎక్కడికి వెళ్లినా మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ ఉండనే ఉంటుంది. దీంతో ఇతగాడి కామెడీకి అడ్డు లేకుండా పోయింది. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు లైవ్ సిట్యువేషన్‌కి తగిన జోక్స్ ఈ కమెడియన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇకపై అమ్మ, నాన్నలతో కలిసి మణికొండలో కొన్న ఇంట్లో ఉండబోతున్నాడు అవినాశ్. వారి కలలను నెరవేర్చినందుకు ఆనందంలో తబ్బుబ్బిపోతున్నాడు.  ఇకపై సినిమాలపై ఫోకస్ కూడా పెడతానని చెబుతున్నాడు. ఏది ఏమైనా ‘జబర్దస్త్’ మీకు  మస్త్ లైఫ్ ఇచ్చింది గురూ..!. కాగా అవినాశ్ గృహ ప్రవేశం కార్యక్రమానికి పలువురు స్టార్స్ విచ్చేశారు. జబర్దస్త్ యాక్టర్స్‌తో పాటు డ్యాన్స్ మాస్టర్ యామి, రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, యాంకర్ శ్రీముఖి, మల్లెమాట ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్ పొట్లూరి రవి పాల్గొన్నారు.