AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Avinash: జీవితాంతం మోయలేని నరకం.. అందరినీ నవ్వించే ముక్కు అవినాష్ లైఫ్‌లో ఇంత విషాదముందా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ముక్కు అవినాష్ ఒకడు. తన కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసిన అవినాష్ అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే అందరినీ నవ్వించే అవినాష్ జీవితంలో ఒక తీరని విషాదముందని తెలుసా?

Jabardasth Avinash: జీవితాంతం మోయలేని నరకం.. అందరినీ నవ్వించే ముక్కు అవినాష్ లైఫ్‌లో ఇంత విషాదముందా?
Jabardasth Avinash
Basha Shek
|

Updated on: Nov 12, 2026 | 6:30 PM

Share

ముక్కు అవినాష్.. బుల్లితెర ఆడియెన్స్ కు ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో తనదైన కామెడీతో, గెటప్పులతో నవ్వులు పూయించిన అవినాష్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేశారు. విజేతగా నిలవకున్నా తనదైన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్నాడు అవినాష్. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా ఓ టీవీ షోలో బాగా ఎమోషనల్ అయ్యాడీ జబర్దస్త్ కమెడియన్. తన జీవితంలో జరిగిన విషాదాన్ని మరోసారి గుర్తు తెచ్చుకున్నాడు. సంవత్సరమో.. రెండేళ్లలో ఆ దుఃఖం పోయేది కాదు.. జీవితాంతం మోయలేని నరకాన్ని దేవుడు తనకు ఇచ్చాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. అవినాష్ భార్య పేరు అనూజ. 2021లో వీరి వివాహం జరిగింది. వారి ప్రేమకు ప్రతీకగా 2024లో అనూజ తొలిసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో అవినాష్ ఆనందానికి హద్దుల్లేవు. పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలి? ఎలాంటి డ్రెస్సులు కొనాలి? ఇలా తన మొదటి బిడ్డ రాక కోసం ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు అవినాష్. కానీ అవినాష్ ఆశలను విచ్ఛిన్నమయ్యాయి. భార్య అనూజకు అబార్షన్ అయ్యింది. కడపులోనే బిడ్డ చనిపోయాడు. దీంతో అవినాష్ గుండెపగిలేలా ఏడ్చాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడీ జబర్దస్త్ కమెడియన్. టీవీ షోలో భాగంగా మాట్లాడుతూ.. ‘బాబు అనూజ కడుపులో ఉన్నాడు. అయితే సడన్ గా ఫోన్ వచ్చింది. బాబు లోపల చనిపోయారండి అని ఫోన్ చేశారు. నేను అనూజ పొట్ట దగ్గరకు వెళ్లి నాన్న లెగు లెగు అని అడిగాను. అయితే వాడు మార్నింగే చనిపోయాడంట. ఆ విషయం నాకు తెలియదు కదా. చనిపోయిన ఆ బాబుతోనే ఈవినింగ్ అంతా ఆడుకున్నాను. డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. సినిమాల్లో గుండెపై నొక్కితే బతుకుతారంట కదా..అలా మీరు ఏదైనా చేయండి నా కొడుకును బ్రతికించండి అని ప్రాధేయపడ్డాను’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు అవినాష్. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ బాధను తగ్గిస్తూ దేవుడు అవినాష్- అనూజ దంపతులకు 2025 మే 14న మరో పండంటి మగ బిడ్డను ప్రసాదించారు. ఆ బాబుకి అద్వైత్ అని నామకరణం చేశారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫొటోస్ కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

భార్య, కుమారుడితో జబర్దస్త్ అవినాష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us