Gormati Banjara Movie: ‘గోర్ మాటి’ పాటని ఆవిష్కరించిన చంద్రబోస్.. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా సినిమా చూడాలని పిలుపు..

|

Oct 12, 2021 | 5:30 PM

Gormati Banjara Movie: బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్, కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు..

Gormati Banjara Movie: గోర్ మాటి పాటని ఆవిష్కరించిన చంద్రబోస్.. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా సినిమా చూడాలని పిలుపు..
Gormati Banjara Movie Song
Follow us on

Gormati Banjara Movie: బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రంలోని సాంగ్ ని చంద్రబోస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో 12 కోట్లమంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు అద్భుతంగా నటించారు. దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జబర్దస్ అదిరే అభి మాట్లాడుతూ.. ‘మీరందరూ ఈ సినిమాను చూసి హిట్ చేస్తే… ఇంకొక పది సినిమాలు వస్తాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లాగా బంజారా సినిమా కూడా ఉండాలి’ అని అన్నారు. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన శంకర్ జాదవ్ మాట్లాడుతూ… ‘ఈ బ్యానర్‌లో వస్తున్న గోర్ మాటి సినిమాతో ఆగిపోదు. బంజారాను స్థాయిని పెంచుతూ బంజారా జాతి గురించి తెలుపుతూ అందరి మెప్పు పొందేలా ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వస్తాయని అన్నారు. డైరెక్టర్, హీరోగా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. మీ ఆశీస్సులు కావాలి’ అని అన్నారు.
నిర్మాత రేఖ్య నాయక్ మాట్లాడుతూ… ‘ఈ సినిమాకోసం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్, డి.ఓ.పి గోపి, మ్యూజిక్ డైరెక్టర్ యమ్. యల్.రాజా,ఎడిటర్ క్రాంతి ఇలా చిత్ర యూనిట్ అందరూ కూడా ఏంతో డెడికేషన్‌ వర్క్ చేశారు. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శంకర్ ని తమ్ముడుగా భావిస్తాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది మా సినిమాను అందరూ చూసి గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను’ అని అన్నారు.
నటీనటులు : శంకర్ జాదవ్, కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్, డాక్టర్ శివ శంకర్, జబర్దస్త్ గడ్డం నవీన్, చిట్టి బాబు, సునీత మనోహర్, మహేంద్ర, సంపత్ నాయక్, శర్వన్ పెరుమాల్, చయాంక్, పురుషోత్తం రెడ్డి తదితరులు, సాంకేతిక
నిపుణులు : బ్యానర్ : బంజారా బిగ్ సినిమాస్ , నిర్మాత : రేఖ్య నాయక్, దర్శకత్వం : శంకర్ జాదవ్ , మ్యూజిక్ : ఎం యల్ రాజా, డీ ఓ పి : గోపి , ఎడిటర్ : క్రాంతి, విజువల్ ఎఫెక్ట్స్ : రాము అద్దంకి, లిరిక్స్ : ఎం శ్రీనివాస్ , యాక్షన్ : దేవరాజ్, పి.ఆర్.ఓ : బాబు నాయక్

Also Read: ఆఫ్ఘనిస్తాన్‌లో నిండుకుంటున్న ఆహార నిల్వలు.. పోషకాహార లోపంతో 10లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు..