Project K: ప్రాజెక్ట్‌-Kలో కీలక పాత్రలో నటిస్తున్న కమల్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

మహానటితో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశాడు నాగ్ అశ్విన్. ఈ సారి ఆయన ఊహకందని మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు రెడీ అయినట్లే అనిపిస్తుంది. ఆయన పాత్రలు ఎంచుకునే విధానం.. బయటకు వస్తున్న సమాచారం సినిమాపై అంచనాలను గగనానికి పెంచుతుంది.

Project K: ప్రాజెక్ట్‌-Kలో కీలక పాత్రలో నటిస్తున్న కమల్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్
Kamal Haasan in Project K

Updated on: Jun 25, 2023 | 1:21 PM

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్ మూవీ ప్రాజెక్ట్‌ కే. ఇప్పటికే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అన్న పేరున్న ఈ సినిమా ఇప్పుడు మోర్ అండ్ మోర్‌ బిగ్గర్‌గా మారుతోంది. మేకింగ్, బడ్జెట్ పరంగానే కాదు కాస్టింగ్ పరంగానూ ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో కనిపిస్తోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ సినిమాలో ఇద్దరు లెజెండరీ స్టార్స్‌. యస్‌.. ఇలాంటి క్రేజీ కాంబో త్వరలోనే సిల్వర్‌ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న కన్ఫర్మేషన్‌ గతంలోనే ఇచ్చింది మూవీ టీమ్‌. తాజాగా ఈ సినిమా యూనిట్‌తో మరో లెజెండ్ జాయిన్ అయ్యారు.

విక్రమ్ సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్‌, ప్రాజెక్ట్ కే టీమ్‌తో జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో కమల్‌, విలన్‌గా నటిస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరగుతోంది. క్యారెక్టర్ ఏంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా కమల్‌ మూవీ టీమ్‌తో జాయిన్ అవుతున్నారని అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు మేకర్స్. ‘ఈయన లెజెండ్.. ఈ పాత్రకు లెజెండ్ మాత్రమే కావాలి. మీ నుంచి నేర్చుకునేందుకు, కాలానికి అతీతమైనది చిత్రీకరించేందకు ఎదురుచూస్తున్నాను సార్’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు.

ఒకే సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తుండటంతో దీపిక పదుకోన్‌, దిశా పఠాని లాంటి గ్లామర్ క్వీన్స్‌ హీరోయిన్స్‌గా కనిపిస్తుండటంతో ప్రాజెక్ట్ కే మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది వైజయంతి మూవీస్.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.