ఐటీ అధికారుల దూకుడు.. దిల్ రాజు భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఐటీ అధికారుల దూకుడు.. దిల్ రాజు భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు..
Dil Raju

Updated on: Jan 21, 2025 | 12:41 PM

భారీ బడ్జెట్‌లు సరే.. కలెక్షన్లు ఏంటి.. వాటి లెక్కలేంటి..? ఐటీ అధికారుల ఫోకస్‌ ఇదే. ఉదయం నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాలు వేడి పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏం జరుగుతోందో బ్రేకింగ్స్‌లో చూస్తున్నాం.. హైదరాబాద్‌లో ఐటీ అధికారుల దూకుడు చూపిస్తున్నారు. ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌ నిర్మాతల ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు.  ఏక కాలంలో ఎనిమిది చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర , మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు హాట్‌టాపిక్‌ అయ్యాయి.

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర , మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాయి. కొన్ని సినీ ఫైనాన్స్‌ సంస్థలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్‌లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో కొనసాగుతున్న సోదాలు..

దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్ తో పాటు తో పాటు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో ఇంకా కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, ఆయన కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు,కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఆరాతీస్తున్నారు అధికారులు. కాగా తాజాగా దిల్ రాజు భార్య ను ఇంట్లో నుండి బయటకి తీసుకెళ్లారని తెలుస్తుంది. దిల్ రాజు భార్య తేజస్విని ను బ్యాంక్ కు తీసుకెళ్లారు ఐటీ అధికారులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.