Peddi Movie: రామ్ చరణ్ పెద్ది మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? కారణాలు ఇవేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'పెద్ది'. మొదటి సినిమా ఉప్పెన తోనే జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? కారణాలు ఇవేనా?
Ramcharn Peddi Movie

Updated on: Mar 16, 2026 | 7:38 PM

గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘పెద్ది’. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మార్చి 26న విడుదల కావాల్సిన పెద్ది సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు రిజెక్ట్ చేశారట. మొదట పెద్ది సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పారట బుచ్చిబాబు. అయితే తారక్ అప్పటికే చాలా సినిమాలకు కమిటై ఉండడంతో ఈ మూవీని చేయలేపోయాడట.

ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవడంతో బుచ్చిబాబు ఈ కథని అల్లు అర్జున్ కి కూడా వినిపించారట. కానీ బన్నీ సైతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడట. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను సైతం సంప్రదించారట బుచ్చి బాబు. అయితే సూర్య కూడా కొన్ని కారణాలతో ఈమూవీని చేయలేకపోయారట. దీంతో తన గురువు సుకుమార్ సహాయంతో పెద్ది కథను రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడట బుచ్చిబాబు. చరణ్ తో పాటు చిరంజీవి కూడా ఈ కథను విని బాగా ఇంప్రెస్ అయ్యారట. వెంటనే మూవీకి ఒకే చెప్పారట. అలా పెద్ది సినిమా పట్టాలెక్కిందట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us