AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ తొలిసారి ఓ డివోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తోన్న లేలెస్ట్ సినిమా ఇరుముడి. నిన్నుకోరి, మజిలి వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ 'ఇరుముడి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Irumudi Movie
Basha Shek
|

Updated on: Jul 21, 2026 | 8:22 PM

Share

ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహరాజా రవితేజ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే అభిమానులను మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడీ లోటును తీర్చేందుకు ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవన్న. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి ఒక డివోషనల్ మూవీతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గతంలో మజిలి, నిన్నుకోరి వంటి ప్రేమకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై అంచనాలను అమితంగా పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగ‌స్టు 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇరుముడి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను మొదట నాగచైతన్యకు వినిపించారట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమా అనంత‌రం శివ మొదట‌ చైత‌న్య‌ను క‌లిసి ఈ స్క్రిప్ట్ వినిపించాడ‌ట. అతనికి కూడా ఈ కథ తెగ న చ్చేసిందట. అయితే అప్పటికే నాగ చైతన్య వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత రవితేజ లైన్లోకి వచ్చాడట. ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. నాగ చైతన్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమోనని చాలా మంది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇరుముడి డబ్బింగ్ పనుల్లో రవితేజ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ