Ram Charan: త్వరలో రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..

|

Apr 24, 2021 | 10:31 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో  బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్.

Ram Charan: త్వరలో రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..
Rangasthalam
Follow us on

Ram Charan:

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో  బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ  సినిమా ఆచార్య లో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. ఈ రెండు ఇసినిమాలతోపాటు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ పొలిటీషియన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. శంకర్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ సినిమా అలాగే చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రానుందంటూ వార్తలు వస్తున్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ , రామ్ చరణ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. 2018 మార్చిలో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సుకుమార్ – చరణ్ ఇద్దరూ భావిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోందని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..