మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా యువన్ శంకర్ రాజా అందించే మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు యువన్ దర్శకుడిగా మారబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే విషయం కోలీవుడ్ లో అలాగే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది. 1996 నుంచి సినీ అభిమానులను తన సంగీతంతో అలరిస్తూ, తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు యువన్ శంకర్ రాజా. సినిమా ఇండస్ట్రీలో ఇళయ రాజా, ఏ ఆర్ రెహమాన్ లాంటి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా యువన్ శంకర్ రాజా తన మార్క్ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నారు యువన్.
1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.
యువన్ సంగీతం అందించిన సినిమాలోని పాటలన్నీమ్యూజిక్ లవర్స్ హృదయాలకు దగ్గరగా ఉంటాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించడమే కాకుండా అనేక చిత్రాలను నిర్మించారు. శీనురామస్వామి దర్శకత్వంలో హరీష్ కళ్యాణ్ నటించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’, విజయ్ సేతుపతి నటించిన ‘మమనిథన్’ చిత్రాలను ఆయన నిర్మించారు. ఈ నేపధ్యంలో యువన్ శంకర్ రాజా దర్శకుడిగా మారనున్నట్టు సమాచారం. యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన యువన్ శంకర్ రాజా.. నా కొత్త సినిమాలో శింబును లీడ్ రోల్ లో నటింపజేస్తాను అని అన్నారు. దాంతో త్వరలోనే యువన్ డైరెక్టర్ గా చేస్తారని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.