
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నా వారణాసి సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తుంది. అలాగే కుంభ అనే నెగిటివ్ పాత్రలో పృథ్వీరాజ్కనిపించనున్నారు.
అలాగే వారణాసి సినిమాలో మహేష్ బాబు రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు.
యానిమల్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. దాంతో వారణాసి సినిమా తర్వాత సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి