Vinay Rai: “అందాల భామనే పట్టావ్ గా..!”క్రేజీ బ్యూటీతో డేటింగ్ చేస్తున్న హనుమాన్ విలన్

|

May 13, 2024 | 1:10 PM

స్టైలిష్ విలన్ గా వినయ్ రాయ్ కు మంచి గుర్తింపు వచ్చింది. 2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. ఆతర్వాత తమిళ్ లోనే వరుసగా సినిమాలు చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు.

Vinay Rai: అందాల భామనే పట్టావ్ గా..!క్రేజీ బ్యూటీతో డేటింగ్ చేస్తున్న హనుమాన్ విలన్
Vinay Rai
Follow us on

వినయ్ రాయ్..హీరోగా చాలా సినిమాల్లో నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే వినయ్ రాయ్ హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. స్టైలిష్ విలన్ గా వినయ్ రాయ్ కు మంచి గుర్తింపు వచ్చింది. 2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. ఆతర్వాత తమిళ్ లోనే వరుసగా సినిమాలు చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు. వరుణ్‌ డాక్టర్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్నాడు.

అయితే ఈ స్టైలిష్ విలన్ ఓ క్రేజీ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. వినయ్ రాయ్ విమలా రామన్ తో డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో ఎవరైనా ఎప్పుడేనా, జగపతి బాబుతో ‘గాయం’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది.

అలాగే నువ్వా నేనా సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో కనిపించింది. ఇదిలా ఉంటే విమలా రామన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రుద్రాంగి, గాండీవ దారి అర్జున సినిమాలో కనిపించింది. గాండీవ దారి అర్జున సినిమాలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్య భర్తలుగా నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసున్నా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

వినయ్ రాయ్ ఇన్ స్టా..

విమలారామన్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.