
మనోభావాలు దెబ్బతిన్నాయ్’. ఒక సినిమాని అమ్ముకోడానికి ఇంతకు మించిన మార్కెట్ మంత్ర ఇంకోటి లేదు, ఇప్పట్లో రాదు. మనోభావాలు దెబ్బతినేలా ఒక్క డైలాగ్ పేలకపోతే.. ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసినా వేస్ట్! బజ్ రాదు. అలాంటి డైలాగ్.. సినిమాలో కావొచ్చు లేదా సినిమా రిలీజ్ ఈవెంట్‌లో అయినా ఉండొచ్చు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినా రాని పబ్లిసిటీ.. ఆ ఒక్క డైలాగ్ పేలగానే వచ్చేస్తుంది. ‘మరీ చీప్ పబ్లిసిటీ కదా అది’ అని బయటోళ్లంతా అనుకుంటుండొచ్చు. బట్.. దాన్ని మించిన పబ్లిసిటీ స్టంట్ ఇంకోటి ఉందేమో చూపించమనండి చూద్దాం. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం రామ్‌గోపాల్ వర్మ వాడి పడేసిన స్ట్రాటజీ కాదా అని అంటారేమో! ఇప్పటికీ అదే ‘హిట్ ఫార్మాలా’ అన్న విషయం మరిచిపోవద్దు. స్టిల్… కమర్షియల్ వాల్యూ ఉందా కాంట్రవర్సీ రూట్‌కి. లేటెస్ట్‌గా రాజమౌళి డైలాగ్స్‌ను ఓ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అఫ్‌కోర్స్.. ఈ డైలాగ్‌ను వర్మ బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో కలపొచ్చో లేదో తెలీదు గానీ.. స్మెల్ మాత్రం ఆర్జీవీ కిచెన్‌లో వండినట్టుగానే ఉంది. జనరల్ పబ్లిక్‌లో జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే.. ఫిల్మ్ సిటీలో ఆరుబయట ఈవెంట్ ప్లాన్ చేసినా.. దానికి వేల మంది అభిమానులు వచ్చినా.. అదో క్లోజ్ సర్క్యూట్ కిందే లెక్క. అక్కడున్న వాళ్లు తప్ప బయటి వాళ్లు చూసే స్కోప్ లేదు. యూట్యూబ్‌లో ఈవెంట్‌ను రిలీజ్ చేసుంటే అదో లెక్క. బహుశా...